బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి

సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ రంగంలో విషాద వాతావరణం నెలకొంది.చిట్టిబాబు నిర్మాతగా పలు చిత్రాలకు సేవలందించడంతో పాటు, సినీ విశ్లేషకుడిగా తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగంలోని పరిణామాలపై నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.అనేక టెలివిజన్ చర్చల్లో పాల్గొని సినీ అంశాలపై విశ్లేషణలు అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పరిశ్రమలోని సమస్యలు, మార్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశమయ్యాయి.చిట్టిబాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు సినీ పరిశ్రమలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొంటున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?