Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎం సి పి ఐ యూ నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్ఆర్టిసి కార్మికులు తలపెట్టిన న్యాయమైన సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లిలో బుధవారం ఎం సి పి ఐ యూ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సిబ్బంది రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి అనేక ఇబ్బందులు పడ్డారని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించకుండా సమ్మె నివారణకు కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ రంగ సంస్థలో ప్రకటించాలని, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరణ చేసి వెంటనే ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వేతన సవరణ, పిఆర్సి బకాయిలు, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులు పెంచడానికి వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సీ పీ ఐ యూ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, పోలోజు రామకృష్ణ, తొగరి రాహుల్ లు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *