Breaking News

చంద్రబాబు–రేవంత్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాకాణి ఆరోపణ

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ సేద్య ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని కాకాణి తీవ్రంగా విమర్శించారు.ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అలాగే చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు.ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు వ్యవహారం మరింత దిగజారుతున్నదని కాకాణి విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ, రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోందని కాకాణి మండిపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *