బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

మైక్రో ఫైనాన్స్‌ కేసులో తనపై ఆరోపణలు నిరాధారం: గాయని మంగ్లీ

మైక్రో ఫైనాన్స్‌ కేసులో తనపై ఆరోపణలు నిరాధారం: గాయని మంగ్లీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మైక్రో ఫైనాన్స్‌, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను గాయని మంగ్లీ ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు అన్యాయం జరిగిందని పేర్కొన్న మంగ్లీ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని తెలిపారు. చట్టంపై, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంటూ, నిజం తప్పకుండా వెలుగులోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కేసులో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని, న్యాయ ప్రక్రియను గౌరవిస్తానని వెల్లడించారు.ఇదిలా ఉండగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పి పలువురిని ఆకర్షించిన ఈ స్కీమ్‌పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రారంభంలో కొంతమందికి లాభాలు ఇచ్చి నమ్మకం కల్పించి, తర్వాత పెద్ద మొత్తాలు సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సంస్థ కార్యకలాపాలు ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగ్లీ పేరు బయటకు రావడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?