బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు

ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని, భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో కీలక పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతుందని అన్నారు.రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే పలు పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని, ఉత్తరాంధ్రలో ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయని వెల్లడించారు.ఇకపై ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, రాష్ట్రంలోనే అవకాశాలు కల్పిస్తామని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గోదావరి నీటిని తీసుకురావడంపై చర్యలు తీసుకుంటున్నామని, ఏడాది లోపే ఈ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయాన్ని జులైలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఇక గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అప్పటి పాలనలో అవినీతి పెరిగిందని, విద్యుత్ రంగం దెబ్బతిన్నదని ఆరోపించారు. పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్