ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపోల్లో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు చర్యలు ప్రారంభించారు. సమ్మె ప్రభావంతో బస్సుల రాకపోకలు దెబ్బతినడంతో, అత్యవసరంగా ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత డిపో అధికారులను సంప్రదించి వెంటనే అవకాశం పొందవచ్చని అధికారులు తెలిపారు.
నియామకాలకు సంబంధించి వివిధ డిపోల కాంటాక్ట్ నంబర్లు ఇవి:
- చెంగిచెర్ల: 7893088433
- ఉప్పల్: 9959226140
- కుషాయిగూడ: 9959226145
- రాణిగంజ్: 9959226147
- కంటోన్మెంట్: 9959226143
- హకీంపేట: 9959226144
- మేడ్చల్: 9959226152
- రంగారెడ్డి: 9959226150
- కూకట్‌పల్లి: 9959226151
- హెచ్‌సీయూ: 9959226132
- మియాపూర్-I: 9959226153
- మియాపూర్-II: 9959226420
తాత్కాలికంగా నియామకం జరుగుతున్నప్పటికీ, అవసరాన్ని బట్టి సేవలు వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
