బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ అంశంపై వైసీపీపై మంత్రి రవికుమార్ విమర్శలు.. “మాట్లాడే నైతిక హక్కు లేదు”

విద్యుత్ అంశంపై వైసీపీపై మంత్రి రవికుమార్ విమర్శలు.. “మాట్లాడే నైతిక హక్కు లేదు”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లాభాల్లో ఉన్న విద్యుత్ శాఖను దెబ్బతీశారని, పలుమార్లు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు.తిరుపతిలో ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. త్వరలోనే అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయిలో కొత్త నియామకాలు చేపడతామని వెల్లడించారు.పరిశ్రమల విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, దానికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని మంత్రి వివరించారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్