బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“ఇది ప్రభుత్వ హత్యే”.. ఆర్టీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

“ఇది ప్రభుత్వ హత్యే”.. ఆర్టీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన “హత్య”గా ఆయన అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను సమయానికి పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడిన కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు.శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక కార్మికుడికి చివరి వీడ్కోలు కూడా ఇవ్వనివ్వకపోవడం ప్రభుత్వ వైఖరిని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా కార్మిక నేతలను అరెస్ట్ చేయడంపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించి, చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి