Breaking News

పంచాయతీరాజ్ శాఖలో సంచలన మార్పులు.. గ్రామాభివృద్ధిలో కొత్త అధ్యాయం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి కొత్త ఊపొచ్చింది. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించడం పంచాయతీరాజ్ శాఖకు విశేష గుర్తింపు తీసుకొచ్చింది.రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ వంటి విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధిస్తూ మొత్తం ఐదు జాతీయ అవార్డులు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి.గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తూ పంచాయతీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. గ్రామ పంచాయతీలకు స్వయంప్రతిపత్తి పెంపు, నిధుల వినియోగంలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రతి డీడీఓ కార్యాలయానికి ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి, డీఎల్‌పీవో, ఏపిడీ, డ్వామా అధికారులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు సేవలు సులభతరం చేశారు.‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో రహదారి, విద్యుత్ సౌకర్యాలను విస్తరించారు. కేవలం 18 నెలల్లో 460 కిలోమీటర్ల రహదారులు నిర్మించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దూరప్రాంత గ్రామాలకు తొలిసారి విద్యుత్ అందించారు. సాధారణ గ్రిడ్ సాధ్యం కాని ప్రాంతాల్లో సోలార్ మైక్రో గ్రిడ్‌ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు.పల్లె పండుగ మొదటి దశలో 22,500 మినీ గోకులాలు నిర్మించగా, రెండో దశలో 157 కమ్యూనిటీ గోకులాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ప్రజాసేవపై అంకితభావంతో పంచాయతీరాజ్ శాఖను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *