బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మే 1 నుంచి భూముల ధరల పెంపు.. మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధం

మే 1 నుంచి భూముల ధరల పెంపు.. మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థిరాస్తి రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు, నివాస మరియు వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మే మొదటి వారంనుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూముల విలువలు ప్రాంతాన్ని బట్టి రెండింతలు నుంచి మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షలు ఉన్న భూమి ధర, సవరణ తర్వాత రూ.12 నుంచి రూ.18 లక్షల వరకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా Outer Ring Road పరిధిలో భూముల విలువలను గణనీయంగా పెంచే అవకాశముంది. అలాగే Regional Ring Road, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల ప్రభావంతో డిమాండ్ పెరిగిన ప్రాంతాల్లో ధరలు మరింత పెరగనున్నాయి.ఖాళీ ప్లాట్లు, నివాస లేఅవుట్ల ధరలతో పాటు వాణిజ్య ఆస్తుల విలువలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వ విలువలు మరియు మార్కెట్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంఇదే సమయంలో హిల్ట్ (HILT) పాలసీ అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కాలుష్య కారక పరిశ్రమలను నగర పరిధి బయటకు తరలించి, పరిశ్రమల అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించాలని యోచిస్తోంది.కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ఖర్చు పెరగవచ్చని భావిస్తూ కొనుగోలుదారులు ముందుగానే లావాదేవీలు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి