బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. అజారుద్దీన్, కోదండరాం ఎంపికకు ఆమోదం

తెలంగాణలో ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. అజారుద్దీన్, కోదండరాం ఎంపికకు ఆమోదం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం లభించింది. మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై ఆయన సంతకం చేశారు.ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న అజారుద్దీన్‌కు ఈ నెల 30 నాటికి ఆరు నెలల గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆయన నియామకం దాదాపు ఖరారైనట్లైంది.ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఎంపిక కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను మండలిలోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం సామాజిక, రాజకీయ సమతుల్యతను సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్ ఆమోదంతో ఈ నియామక ప్రక్రియ వేగం అందుకోనుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, అనంతరం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి