బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“నేనే సీఎం అవుతా”.. కవిత ధీమా వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారి

“నేనే సీఎం అవుతా”.. కవిత ధీమా వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతున్న వేళ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను” అంటూ ఆమె వ్యక్తం చేసిన ధీమా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కొత్త రాజకీయ మార్పులకు ఇది సంకేతమని ఆమె పేర్కొన్నారు.మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన కవిత, ప్రజల ఆశీస్సులతో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.సభకు ముందు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన కవిత, అనంతరం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఆశయాల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.అక్కడి నుంచి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్న కవితకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సభలో ఆమె పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.“కచ్చితంగా సీఎం అవుతా” అనే కవిత వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ధీమా వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీయగా, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి