Breaking News

కుల జనాభా తగ్గింపు మన అస్తిత్వానికే అవమానం

మున్నూరు కాపుల జనాభా సంఖ్యను తగ్గించడం రాజకీయ కుట్ర.. అది మన కుల అస్తిత్వానికే అవమానం

ట్రస్టు భవనాన్ని నిర్మించుకుందాం – ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం..

ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా బాధ్యత స్వీకరించిన: ఆవుల రామారావు

జిల్లా అధ్యక్షులు ఇంచార్జీ ల శిక్షణాశిబిరం లో మున్నూరు కాపు ప్రముఖులు

హైదరాబాద్ ,ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక),( బ్యూరో చీఫ్ వై వి): మున్నూరు కాపుల జనాభా సంఖ్య తగ్గింపుతో వారి రాజకీయ,సామాజిక ప్రయోజనాలను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్నూరు కాపు జనాభా లెక్కలను సరిచేయాలని అందుకు రీ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మున్నూరు కాపు రాష్ట్ర సంఘం తీర్మానించింది. మున్నూరు కాపు పటేల్ ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించేది లేదని , ప్రతీ పటేల్ చైతన్యమై ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతారని పలువురు వక్తలు స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకపులు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడం, ఆత్మగౌరవ భవన నిర్మాణం, జిల్లా సదస్సుల నిర్వహణ కోసం సమావేశమయ్యారు.సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా భవిష్యత్తులో చేపట్టబోయే రాష్ట్ర స్థాయి కార్యాచరణ అమలు కోసం ఇంచార్జీల నియామకం చేపట్టారు.శుక్రవారం చందానగర్ లోని సుప్రజా హోటల్లో, రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టo పురుషోత్తం పటేల్ అధ్యక్షతన జరిగిన 33 జిల్లాల అధ్యక్షులు మరియు ఇన్చార్జిల శిక్షణా శిబిరం సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా లెక్కల సేకరణ కోసం జిల్లా అధ్యక్షులు మరియు ఇన్చార్జిలు వెంటనే కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు.కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో భవన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అందుకోసం ప్రతి మున్నూరు కాపును గ్రామస్థాయి నుండి కదిలించాలని తీర్మానించారు.

తెలంగాణలో జనగణన సన్నాహాలు వేగం.. ఇంటింటి లెక్కల కోసం ఏర్పాట్లు పూర్తి దశలో

కార్యక్రమంలో… రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి,ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ అన్ని జిల్లాలలో జిల్లా సదస్సులు నిర్వహించి మన లెక్కలు మనమే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించి గెజిట్లో మన లెక్కలు చేర్చుకోవాలని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సంఘం సలహాదారు రమేష్ హజారి పటేల్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ప్రజలు కులాలుగా గుర్తించబడుతుండం వల్ల కుల అస్తిత్వమే వ్యక్తుల అస్థిత్వంగా పరిణమించిందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి మున్నూరుకాపు బిడ్డ అందరిలాగానే తమ కుల అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నామన్నారు.అందుకు గ్రామస్థాయి నుండి కుల సమాజాన్ని చైతన్య పరచాలని, బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ ఆశయాలనుఅనుసరించి సంఘం కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. రావు, రెడ్డి,యాదవ్ మాదిరి తమ కులవృత్తిని గౌరవాన్ని తెలిపే పటేల్ పేరు చేర్చుకోవాలని ఇందులో భాగంగా 10 లక్షల మందితో పటేల్ నామకరణ మహాసభను భారీగా నిర్వహించాలని సూచించారు, కార్యక్రమంలో పుట్టం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ గ్రామ మండల జిల్లా స్థాయి నుండి సంఘాలను బలోపేతం చేస్తూ ట్రస్ట్ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు, మంగళారపు లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపుల జనసంఖ్య తగ్గడానికి మనకు మనమే కొంత కారణమయ్యామని ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్,మెదక్ తదితర జిల్లాల్లో చాలామంది మున్నూరు కాపులు రెడ్డి పెట్టుకోవడంతో వీరందరి ని రెడ్డి కులంలో కలుపుకున్నారన్నారు, ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య పటేల్, కోశాధికారి సత్యనారాయణ పటేల్ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పటేల్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గాలి అనిల్ కుమార్ పటేల్, తూడి ప్రవీణ్ పటేల్, అపెక్స్ కమిటీ కన్వీనర్ మీసాల చంద్రయ్య పటేల్, బుక్క వేణుగోపాల్ పటేల్, మామిళ్ళ అంజయ్య పటేల్ సహా పలువురు రాష్ట్రస్థాయి కీలక నేతలు జిల్లా అధ్యక్షులు, జిల్లాల ఇన్చార్జిలు పెద్ద ఎత్తున పాల్గొని దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *