Breaking News

దివ్యాంగులకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే….!

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం స్పష్టమైన దూరదృష్టి, సంకల్పంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమేనని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నా రు. ఈ సందర్భంగా శనివారం ఉదయం అశోక్ నగర్ లోని తూర్పు తెదేపా కార్యాలయం వద్ద 6వ డివిజన్ కు చెందిన దివ్యంగుడు మోతిక కుమార స్వామికి రూ. 6 వేలు విలువ చేసే ట్రై సైకి ల్ ను ఎన్టీఆర్ జిల్లా టీడీ పీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఉచితంగా అందజేశారు. ఈ సంద ర్బంగా గద్దె అనురాధ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు అప్ప టి ముఖ్యమంత్రి చంద్ర బాబు దివ్యాంగుల పింఛ న్‌ను రూ.3000కు పెంచి వారి జీవనోపాధికి బలం చేకూర్చి వారికి అండగా నిలిచారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించా రని గత 5 వైసీపీ పాలన లో దివ్యాంగులకు రూపా యి కూడా పింఛన్ పెంచ లేదన్నారు. పైగా ఎందరో దివ్యాంగుల పింఛన్లు తొలగించి వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని ఫలితంగా కొందరు ఆత్మ హత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చోటుచే సుకున్నాయని గుర్తు చేశా రు. దివ్యాంగుల సమస్య లు వినడానికి కూడా అవ కాశాలు లేకుండా జగన్ పరదాల చాటున పాలన చేశారన్నారు. యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పింఛన్ల ను రూ.3000 నుంచి రూ.6000కు, కొన్ని వర్గా ల్లో రూ.5000 నుంచి రూ.15000 వరకు పెంచిందన్నారు. అర్హులైన వారికి త్రీ-వీలర్ వాహనా లు అందించడం వంటి చర్యలు తీసుకుందన్నా రు. దివ్యాంగుల కోసం ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న సిటీ ఆర్డి నరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవె లుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిం చమన్నారు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసు కొని, అడిగిన వెంటనే స్పందిస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి చంద్రబా బు నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పడాల గంగాధర్, పటమట సతీ ష్ చంద్ర, పెనుగొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *