బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కవితపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

కవితపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత చర్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ప్రారంభించడంపై స్పందిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ప్రజల కోసం పోరాటం చేసి ఉంటే మరింత విశ్వాసం పొందేదని వ్యాఖ్యానించారు.కేసీఆర్ పాలనలో రాష్ట్ర వనరులు దుర్వినియోగం అయ్యాయని, నీళ్లు–నిధులు–నియామకాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం సమంజసం కాదని అన్నారు.కవిత సీఎం కావాలనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చారని, అయితే ప్రజలు నిజాన్ని గుర్తిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని, కానీ విమర్శలతో మాత్రమే ముందుకు రావడం సరైంది కాదని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి