బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని, వారి అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.తాడేపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టానికి తుది రూపు ఇస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.టీడీపీ స్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. బీసీల సాధికారత కోసం ప్రత్యేక సమితులను ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వ పాలనలో బీసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి హక్కులు హరించబడ్డాయని మంత్రి విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, రిజర్వేషన్ల తగ్గింపు వంటి చర్యలు బీసీలకు నష్టం కలిగించాయని ఆరోపించారు.ప్రస్తుతం ప్రభుత్వం ‘ఆదరణ’ వంటి పథకాల ద్వారా బీసీ వృత్తులకు పునరుజ్జీవం కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే కాలంలో బీసీలకు మరింత ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్