బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

మెక్సికో వేదికగా ‘వారణాసి’ అంతర్జాతీయ ప్రమోషన్ ప్రారంభం

మెక్సికో వేదికగా ‘వారణాసి’ అంతర్జాతీయ ప్రమోషన్ ప్రారంభం

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లోని ‘వారణాసి’ చిత్ర ప్రమోషన్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని మెక్సికోలో జరిగిన ప్రముఖ ఈవెంట్ CCXP 2026లో పరిచయం చేయడం విశేషం.ఈ కార్యక్రమానికి రాజమౌళి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా, వీడియో సందేశం ద్వారా ప్రేక్షకులతో మాట్లాడారు. మాయన్ నాగరికత, వారి నిర్మాణ శైలి తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు. ముఖ్యంగా తన గత చిత్రం బాహుబలి లోని కొన్ని సెట్ల రూపకల్పనకు మెక్సికోలోని చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు.ఈ ప్యానెల్‌లో నిర్మాత ఎస్. ఎస్. కార్తికేయ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. చిత్ర నిర్మాణం, విజువల్స్, కథా నేపథ్యం వంటి అంశాలపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు.కార్యక్రమంలో భాగంగా ‘వారణాసి’కి సంబంధించిన బిహైండ్-ది-సీన్స్ వీడియోలను ప్రదర్శించగా, అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, సెట్స్ డిజైన్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అడ్వెంచర్, మైథాలజీ, గ్లోబల్ థీమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై ప్రమోషన్లు ప్రారంభం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?