బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కొత్త లుక్‌తో ఆకట్టుకున్న జగన్.. యూరప్ పర్యటనలో స్టైలిష్ ఎంట్రీ

కొత్త లుక్‌తో ఆకట్టుకున్న జగన్.. యూరప్ పర్యటనలో స్టైలిష్ ఎంట్రీ

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయాలకంటే ఆయన కొత్త లుక్, వ్యక్తిగత పర్యటనే చర్చనీయాంశంగా మారింది.కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరిన జగన్, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిగా భిన్నమైన స్టైలిష్ లుక్‌లో కనిపించారు. సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ డ్రెస్సింగ్‌లో కనిపించే ఆయన.. ఈసారి బ్లూ డెనిమ్ షర్ట్, జీన్స్, మోడర్న్ షూస్‌తో ట్రెండీగా దర్శనమిచ్చారు. జగన్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఆయన స్టైల్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ మార్పును అభినందిస్తుండగా, మరికొందరు ఇది కొత్త రాజకీయ సంకేతమా అని చర్చిస్తున్నారు.ఈ పర్యటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు మే 15 వరకు ఆయన యూరప్‌లోనే ఉండనున్నారు. మొదట ఈ పర్యటన ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందియూరప్‌లో పలు దేశాలను సందర్శించే అవకాశం ఉన్నప్పటికీ, అధికారిక వివరాలు ఇంకా వెల్లడ కాలేదు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే జగన్, ఈసారి కొత్త లుక్‌తో కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్