బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా స్పందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంధన సరఫరా అంతరాయం కలగడంతో వెంటనే ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 421 బంకులు తాత్కాలికంగా మూతపడినట్లు అధికారులు వివరించారు. కొన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ‘ప్యానిక్ బైయింగ్’ను అధికారులు పేర్కొన్నారు. ఇంధన కొరత భయంతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల సరఫరాపై ఒత్తిడి పెరిగిందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం పెంచి సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమానంగా ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల్లో భయాందోళనలు తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని తెలియజేయాలని సూచించారు. సరఫరా నిలకడగా కొనసాగుతుందని ప్రజలకు భరోసా ఇవ్వాలని అన్నారు.అలాగే బంకులు మూతపడకుండా ముందస్తు చర్యలు తీసుకుని, అవసరమైతే అదనపు నిల్వలు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణాలు, రద్దీ ప్రాంతాల్లో ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్