బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అసెంబ్లీ అవసరమా? సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్న

ప్రత్యేక అసెంబ్లీ అవసరమా? సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్న

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వైఖరిపై విమర్శలు గుప్పించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను ఎండగడతామని సీఎం వ్యాఖ్యానించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే అన్ని రాజకీయ పార్టీలతో బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ వేదికను రాజకీయ విమర్శల కోసం వినియోగించడం కంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపడం అవసరమని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ, అమలులో ఆలస్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం సరైంది కాదని విమర్శించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్ల రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుందని అన్నారు.మహిళా రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడం కంటే సమగ్ర చర్చల ద్వారా ముందుకు వెళ్లాలని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్