బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జనగణన 2027కు శ్రీకారం.. స్వీయ గణనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

జనగణన 2027కు శ్రీకారం.. స్వీయ గణనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తన వివరాలను నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కీలక ప్రక్రియలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన వివరాలను నమోదు చేయడం ద్వారా దేశ అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పడాలని సూచించారు.స్వీయ గణన విధానం, దాని ప్రాముఖ్యతపై సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. డిజిటల్ విధానంలో జనాభా లెక్కల నిర్వహణతో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్ ప్రియాంక తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగణనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి