బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ

పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పలుచోట్ల బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500కు పైగా పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో దాదాపు 10 శాతం బంకులు స్టాక్ లేక తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం. సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా గణనీయంగా పెరిగింది.సాధారణంగా రోజుకు విక్రయమయ్యే ఇంధన పరిమాణం కంటే 50 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ప్రజలు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో పాటు అదనంగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి డీజిల్ సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని, ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.పరిస్థితి నియంత్రణలోకి రావడానికి ప్రజలు సంయమనం పాటించడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్