బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. జీవకోన రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఎగసిపడిన అగ్నికీలలు, దట్టమైన పొగలు తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల నుంచి స్పష్టంగా కనిపించాయి.సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 50 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. గుట్టలు, రాతిబండలతో కూడిన భూభాగం కారణంగా అగ్నిమాపక చర్యలు కొంత కష్టంగా మారినా, ఫైర్‌లైన్లు ఏర్పాటు చేసి మంటల విస్తరణను అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగించారు.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో విలువైన వృక్ష సంపదతో పాటు అరుదైన వనమూలికలు నష్టం చెందినట్లు అధికారులు తెలిపారు. జీవ వైవిధ్యానికి కీలకమైన ఈ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం పర్యావరణానికి గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు భావిస్తున్నారు.మంటల కారణంగా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు భయంతో పరుగులు తీస్తున్నాయి. కొన్ని జంతువులు సమీప గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. మానవ నిర్లక్ష్యం లేదా సహజ కారణాల వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.ప్రతి వేసవిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ముందస్తు చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్