బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లోని అలకనంద నదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పౌరీ గర్వాల్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ మోహన్ (21) అక్కడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన అతడు, సరదాగా నదిలోకి దూకగా ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అన్వేషణ కష్టంగా మారింది. రాత్రి చీకటి కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసి, ఉదయం మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు ఆధునిక పరికరాలతో యువకుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉధృత ప్రవాహం ఉన్న నదుల్లో నిర్లక్ష్యంగా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి