Breaking News

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి పేరును ఉపయోగించి భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్‌కు చెందిన గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్‌ను పురిమెట్ల బంగారు యాదవ్ అనే వ్యక్తి సంప్రదించాడు. దుండిగల్ ప్రాంతంలో చేపట్టనున్న ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి, తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు.ఈ నమ్మకంతో బాధితుడు విడతల వారీగా సుమారు రూ.1.70 కోట్ల నగదు ఇవ్వడంతో పాటు ఖరీదైన కారు, ఐఫోన్ వంటి వస్తువులను కూడా అందజేసినట్లు సమాచారం. అయితే ప్రాజెక్టు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చెప్పిన రాజకీయ పరిచయాలపై కూడా విచారణ కొనసాగుతోంది.ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల మాటలు నమ్మకుండా, అధికారిక మార్గాల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

కొత్త పార్టీ అవసరమా?.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *