బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ ఆరోగ్యంగా ఉండటం తనకే మంచిదని, అప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడం సులభమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చెడు కోరుకోవడం తన స్వభావం కాదని తెలిపారు. గతంలో కేసీఆర్ గాయపడినప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పిన సీఎం, కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఉంటే తమకు అధికారం రాదనే భావన కుటుంబంలో ఉందని పేర్కొన్నారు.అలాగే కేసీఆర్ హయాంలోనే కల్వకుంట్ల తారక రామారావును సీఎం చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అధికార పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చాయని అన్నారు. అయితే చివరకు వారు అందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు.ఇప్పటికే కేసీఆర్‌ను రెండు సార్లు ఓడించానని, ఓటమి ఆయనకు కొత్త విషయం కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వివక్ష లేకుండా పనిచేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి