బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణను కాపాడుకుందాం.. బీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటుదాం: కేటీఆర్

తెలంగాణను కాపాడుకుందాం.. బీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటుదాం: కేటీఆర్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పదేళ్లపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ ప్రజల్లో నింపాల్సిన అవసరం ఉందన్నారు.వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొంటూ, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటోందని ఆరోపించారు.తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.భవిష్యత్తులో పార్టీ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి