బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం: ప్రధాని మోదీ ధీమా

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం: ప్రధాని మోదీ ధీమా

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రచారానికి ముగింపు పలికిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఆయన, ప్రజల స్పందన చూస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.బ్యారక్‌పూర్‌లో నిర్వహించిన భారీ సభలో మోదీ మాట్లాడుతూ, మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. మళ్లీ బెంగాల్‌కు వచ్చే సారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికే వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొంటూ, హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ ప్రజలు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారని తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.తాను సాధారణ కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వర్తించానని, దేశ ప్రజలే తన కుటుంబమని మోదీ అన్నారు. ప్రజల ఆశయాల సాధనకే తన రాజకీయ ప్రయాణమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రధాని, ఒకప్పుడు ప్రజల నమ్మకంతో వచ్చిన ఆ పార్టీ తన సిద్ధాంతాలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మార్పు అవసరమని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ