బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా విస్తరించాయి.ఈ ప్రమాదంతో దట్టమైన నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేసి, పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. కిలోమీటర్ల దూరం నుంచే ఈ పొగ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సమీప ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.ఈ ఘటన కారణంగా అంబర్‌పేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. షోరూమ్‌లో ఉన్న పలు కొత్త కార్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో లోపల ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి