బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖకు కొత్త గుర్తింపు.. ఏఐ హబ్‌గా రూపాంతరం: మంత్రి లోకేష్

విశాఖకు కొత్త గుర్తింపు.. ఏఐ హబ్‌గా రూపాంతరం: మంత్రి లోకేష్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అభివృద్ధిలో కీలక మలుపు తిరుగుతోందని ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటివరకు ఉక్కు నగరంగా పేరొందిన విశాఖ, ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా మారబోతుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కృషి చేశామని, విజనరీ లీడర్‌షిప్‌ను ప్రస్తావిస్తూ పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించామని వెల్లడించారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు.“నమో” అనేది కేవలం పదం కాదని, నాయుడు–మోదీ కలయికకు ప్రతీకగా మారిందని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం “ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని” అని స్పష్టం చేస్తూ, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. విశాఖను ఆధునిక సాంకేతికత, ఐటీ రంగాల్లో ముందంజలో నిలిపి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్