బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం.. ‘స్పందన’ టీమ్స్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం.. ‘స్పందన’ టీమ్స్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే షీ టీమ్స్, ‘స్టాండ్ విత్ హర్’ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అదే దిశగా ఇప్పుడు ‘స్పందన’ (తక్షణ రక్షణ) టీమ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ స్పందన వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసు అధికారులు, పీస్ కమిటీ సభ్యులతో సమావేశమై ఈ టీమ్స్ పనితీరుపై చర్చించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళలు స్వయంగా నిలబడాలంటే వారికి భద్రత అత్యవసరమని అన్నారు. మహిళలు చదువు, ఉద్యోగం, వ్యాపారం స్వేచ్ఛగా కొనసాగించగలిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.స్పందన టీమ్స్ 24 గంటల పాటు పనిచేస్తూ, బాధితుల వద్దకు వెళ్లి తక్షణ సహాయం అందించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. మహిళలకు భరోసా కల్పించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

మహిళలపై నేరాలను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు, పీస్ కమిటీలు కూడా భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అలాగే మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని హెచ్చరించారు.డ్రగ్స్ బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సమాజంలో మత్తు సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుతో మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాలకు భారీ రుణ సౌకర్యాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి