బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం ‘ఏఐపట్నం’గా మారబోతోంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

విశాఖపట్నం ‘ఏఐపట్నం’గా మారబోతోంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో భాగంగానే గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలో శంకుస్థాపన దశకు చేరుకుందని, రికార్డ్ టైమ్‌లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఐటీ రంగంలో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని, విశ్వసనీయ భాగస్వామిగా గుర్తింపు పొందిందని చెప్పారు.గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతారని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా ఎదగబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్