బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని పోలీసులు తీవ్రంగా పరిగణించి, కేసును ముంబై ATSకి అప్పగించారు.ఆదివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు గార్డులపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ముందుగా వారి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుని, అనంతరం కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.నిందితుడు జుబేర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతని వద్ద లభించిన లేఖలో తీవ్రవాద భావజాలానికి సంబంధించిన పదాలు ఉండటంతో కేసు మలుపు తిరిగింది. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కారణాలా లేదా ఉగ్రవాద సంబంధాలున్నాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం నిందితుడి మొబైల్ డేటా, సోషల్ మీడియా కార్యకలాపాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా, లేదా స్వయంగా ప్రభావితమై ఈ దాడికి పాల్పడ్డాడా అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ ఘటన నేపథ్యంలో మీరా రోడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ