Breaking News

మే 10న హైదరాబాద్‌కు మోదీ రాక… బీజేపీ ఏర్పాట్లపై దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో మోదీ పర్యటనపై సమగ్ర చర్చ జరిగింది.రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మోదీ రాకను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు.మే 10న పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, ప్రజల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సభ ద్వారా రాష్ట్రంలో పార్టీ బలాన్ని చాటాలని, ప్రజల్లో మరింత చేరువ కావాలని బీజేపీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *