బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు: మంత్రి ఉత్తమ్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలకు అవసరమైనంత సరఫరా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఇంధన సరఫరా పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచడంతో పాటు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో డీజిల్ సరఫరాను 210% వరకు, పెట్రోల్ సరఫరాను 132% వరకు పెంచినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రోజుకు మొత్తం 36,404 KL ఇంధనం సరఫరా అవుతోందని మంత్రి తెలిపారు. డీజిల్ సరఫరా 7,348 KL నుంచి 22,782 KLలకు పెరగగా, పెట్రోల్ సరఫరా 5,883 KL నుంచి 13,622 KLలకు పెరిగిందని వివరించారు. మొత్తంగా రోజువారీ సరఫరా సుమారు 175% పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి