బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సీఎం, డిప్యూటీ సీఎం పేర్లతో రాజశ్యామల యాగం.. మంత్రి పార్థసారథి ప్రత్యేక ప్రార్థనలు

సీఎం, డిప్యూటీ సీఎం పేర్లతో రాజశ్యామల యాగం.. మంత్రి పార్థసారథి ప్రత్యేక ప్రార్థనలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుభిక్షం కోసం మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేర్లపై ప్రత్యేకంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.కారకంపాడులోని తన స్వగ్రామంలో ఈ యాగాన్ని ఘనంగా నిర్వహించిన మంత్రి, పెద్ద ఎత్తున హోమగుండం ఏర్పాటు చేసి పండితులతో శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యాగంలో భక్తులు, స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి విజయాలు చేకూరాలని మంత్రి ప్రార్థించారు. యాగం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.హిందూ సంప్రదాయాల ప్రకారం రాజశ్యామల యాగం జ్ఞానం, కీర్తి, విజయాలను ప్రసాదించే పవిత్ర క్రతువుగా భావిస్తారు. జ్ఞాన సరస్వతి రూపమైన రాజశ్యామల దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్