బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికార సంస్థలను సంప్రదించాలని చెప్పారు.హైదరాబాద్‌లోని కాచిగూడ బస్ టెర్మినల్లో ‘అమ్మఒడి’ తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని, కాచిగూడ రైల్వే స్టేషన్లో పిల్లల దత్తత కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దత్తత తీసుకోవాలనుకునే వారు ఐసీడీఎస్ ద్వారా మాత్రమే ముందుకు రావాలని సూచించారు. అనధికార మార్గాల్లో దత్తతలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.పిల్లల తల్లులకు సౌకర్యం కల్పించేందుకు బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.అలాగే సమ్మక్క-సారలమ్మ జాతర వంటి భారీ కార్యక్రమాల్లో కూడా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి