బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్‌న్యూస్.. మే డే నాడు బిల్లుకు గవర్నర్ ఆమోదం

గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్‌న్యూస్.. మే డే నాడు బిల్లుకు గవర్నర్ ఆమోదం

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించడంతో, మే డే సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టపరమైన రక్షణ కలగనుంది.ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. పని భద్రత, ఆరోగ్య బీమా వంటి పథకాలను అందించడమే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు. అగ్రిగేటర్ కంపెనీల నియంత్రణకు నిబంధనలు తీసుకొచ్చి, కార్మికుల హక్కులను బలపరిచారు.అదేవిధంగా సర్వీస్ టాక్స్‌లో కొంత భాగాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించేలా చర్యలు చేపట్టారు. పనివేళలు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయడానికి కార్మిక శాఖ చర్యలు ప్రారంభించింది. అసంఘటిత రంగంలో ఉన్న గిగ్ ఎకానమీకి ఈ చట్టం కీలక మలుపుగా నిలవనుందని భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి