Breaking News

విద్యార్థులకు సమగ్ర సదుపాయాలు సకాలంలోనే.. సెంట్రలైజ్డ్ కొనుగోళ్లపై సీఎం రేవంత్ కఠిన ఆదేశాలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటుపుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు సకాలంలో అందితే విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించగలరని తెలిపారు.రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థలలో విద్యార్థులకు అందించే సామగ్రిని కేంద్రీకృత కొనుగోలు విధానంలోనే అందించాలనే అంశంపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గతంలో వేర్వేరు శాఖలు విడిగా కొనుగోలు, సరఫరా చేయడం వల్ల ఏకరూపత లోపించడంతో పాటు అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.ఇకపై సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని, సరఫరాదారుల ప్రయోజనాల కోసం కాదని అన్నారు.విద్యార్థులకు అందించే నోటుపుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్‌సూట్లు, బెడ్‌షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవిగా ఉండాలని, జూన్ 15 నాటికి పూర్తిగా అందించాలన్నారు. సరఫరా పూర్తైన వెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు.పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని, గ్రామ స్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లకు సామగ్రి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను ఫోటోలు, వీడియోల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రతి విద్యార్థికి పూర్తి సామగ్రి అందిందో లేదో నిర్ధారించాలన్నారు.అదనంగా, సామగ్రి నాణ్యతపై విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని, శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కార్మికుల చెమటకే గౌరవం.. మే డే సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *