విజయవాడ. మే 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృద యపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటి లోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర రవా ణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల అంకిత భావం తో చేసిన సేవలను మం త్రి ప్రత్యేకంగా అభినం దించారు. ప్రతికూల పరి స్థితుల్లోనూ, ఎండలు, వర్షాలు లెక్కచేయకుండా ప్రజలకు నిరంతరం సేవ లందిస్తున్న ఆర్టీసీ సిబ్బంది కృషి ప్రశంసనీయం అన్నారు. ప్రయాణికుల భద్రత, సమయపాలన లో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నా రు. కార్మికుల శ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని మంత్రి తెలిపారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగంలో కార్మికులే ప్రధాన శక్తిగా నిలుస్తున్నా రని అన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రక్షణ సేదంగా మారి ఆరోగ్యాలను అభి వృద్ధి చేసే కార్మిక శక్తికి వందనం తెలుపుతూ, మండుటెండ, చలి, వర్షం వంటి ప్రతి కూల పరిస్థితు ల్లోనూ అలుపెరగక పని చేసే కార్మికుల త్యాగాలు స్మరణీయమన్నారు. శ్రమి క వర్గం హక్కులు, సాధిం చిన విజయాలను స్మరిం చుకునే రోజు మే డే అని పేర్కొన్నారు. శ్రమ దోపిడీ వ్యతిరేక పోరాటాల ఫలి తంగా కార్మిక లోకం లో చైతన్యం వెలిసిందని, కార్మికుల ఐక్యత, శ్రమ గౌరవాన్ని చాటిచెప్పే వేడుక మే డే అని తెలి పారు. దేశ ఆర్థిక వ్యవ స్థను నిలబెట్టే శక్తి కార్మిక వర్గమని స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు, వైద్య సేవలు, బీమా పథకాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నా రు. నిర్మాణ రంగ కార్మికు లకు భద్రత కల్పించేందు కు తీసుకున్న నిర్ణయాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుప రుస్తాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం లో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తు న్నామని, ప్రతి నెల జీతా లు, పెన్షన్లు సమ యానికి చెల్లించే విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నార్ కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించేందుకు సంక్షేమ బోర్డులు, బీమా పథకాలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. కార్మికుల క్షేమం, గౌరవం ప్రతి ఒక్క రి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. సమాన త్వం, హక్కులు ప్రతి కార్మికుడికి అందాలని, దేశం అభివృద్ధి చెందా లంటే కార్మికుడు అభివృ ద్ధి చెందాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం లోని సమస్త కార్మిక సోదర సోదరీమ ణులకు మంత్రి మరోసారి అంతర్జా తీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
