Breaking News

కార్మిక ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన

ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి

లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్

కార్మిక సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది

కార్మికుల కోసం ‘లేబర్ అడ్డా’లు ఏర్పాటు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కనీస వేతనాల పెంపుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి

కార్పొరేట్ ప్రయోజనాల కోసం హక్కులను కాలరాస్తున్నారు

మంగళగిరి మే 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కార్మికుల హక్కుల పరిరక్షణకు ఎనిమిది గంటల పని దినాన్ని కచ్చితంగా అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. మే డే ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, కార్మిక ఐక్య పోరాటంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మేడే ను పురస్కరించుకొని శుక్రవారం మంగళగిరి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో జెండాలను ఆవిష్కరించారు.మంగళగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం, ఇందిరా నగర్ వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య జండాను ఆవిష్కరించారు.. ఎయిమ్స్ మెయిన్ గేట్, అంబులెన్స్ స్టాండ్, మంగళగిరి కొత్తపేట,హాస్పటల్ రోడ్డు, కొత్త బస్టాండ్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్, కేకును ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నవరపు ప్రభాకర్ జెండాలను ఆవిష్కరించారు. ఎయిమ్స్ బైపాస్ గేటు వద్ద, నిడమర్రు ఆటో స్టాండ్, హుస్సేన్ కట్ట వద్ద ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ జండాలను ఆవిష్కరించారు.మంగళగిరి మున్సిపాలిటీ వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసయ్య జండాను ఆవిష్కరించారు. చిన్న కాకాని పంచాయతీ ఆఫీస్ వద్ద ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు నందం బ్రహ్మేశ్వర రావు జెండాను ఆవిష్కరించారు.. మంగళగిరి పట్టణంలోని నాలుగో వార్డ్ పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు కోడూరు శివాజీ జెండాను ఆవిష్కరించారు. ఆత్మకూరు సెంటర్ వద్ద జెండాను సిపిఐ సీనియర్ నాయకులు పంట గాని మరియదాసు ఆవిష్కరించారు. నూతక్కి గ్రామంలో జెండాను పఠాన్ నబి, షేక్ మదీనా జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో జెండాల ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ మే డే చరిత్ర కార్మికుల హక్కుల సాధనలో విశేష ప్రాధాన్యత కలిగిందని నాయకులు పేర్కొన్నారు. కార్మిక ఐక్యవర్గం సమిష్టిగా పోరాడినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కూటమి పాలనలో కార్మికులకు భద్రత, ఉపాధి పెరిగింది: మంత్రి సుభాష్

కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్మిక చట్టాలను బలహీనపరిచే విధానాలను వ్యతిరేకిస్తూ, కార్మిక సంక్షేమమే దేశ అభివృద్ధికి మూలస్థంభమని పేర్కొన్నారు…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కార్పొరేట్ ప్రయోజనాల కోసం హరించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శ్రమ దోపిడీకి దారితీసే విధానాలను వెంటనే నిలిపివేయాలని కోరారు.నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.నేటి అంతర్జాతీయ పరిస్థితులపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నంలో భాగంగా అమెరికా సామ్రాజ్యవాద విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రాంతీయ శాంతి భద్రతలకు ముప్పుగా మారి తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు… సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద రావుల శివారెడ్డి విగ్రహానికి సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాలలో సిపిఐ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పి సాంబశివరావు,ఉడత శ్రీనివాసరావు, గోలి వెంకటేశ్వరరావు, జె నవీన్, అహ్మద్ బేగ్, సందు పట్ల భూపతి, జె శంకర్రావు, పి సాంబశివరావు, బి శ్రీనివాసరావు, ఎం కృష్ణ, సింహాద్రి అంజిబాబు, ఆదిమూలం శీను, కటారి శీను, కె అబ్రహం, జి ఏసు, సుభాని, జీడి సుభాని, మాప్ జానీ, నారదాసు నాగేశ్వరరావు, సిహెచ్ భాస్కర్, సోలా నాగయ్య, చిన్ని అంజయ్య, జాలాది విజయేందర్ రావు, గోలి సాంబశివరావు, దాసరి నాగరాజు, గోలి రామకోటి, కాగితాల భూషణం, పదం సత్యనారాయణ, కంచర్ల నాగేశ్వరరావు, కె పద్మనాభం, గజవల్లి పరమేశం,గుమ్మ మణికంఠ, ఎర్రగుంట లక్ష్మణరావు, జాలాది ఏసు పదం, జాలాది కిరణ్, ఎస్ కే సుభాని,రవికుమార్, డేవిడ్, సుందరావు, చందు, కిషోర్, ఆయా వార్డుల్లో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *