బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. హైడ్రా చర్యలపై రాజకీయ రగడ

కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. హైడ్రా చర్యలపై రాజకీయ రగడ

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల పోరు మరింత ఉధృతమైంది. కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటైన విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలను తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు.చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేయడం ప్రజల ప్రయోజనాల కోసమేనని, దీనిపై బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు. నగర పరిసరాల్లోని చెరువులను బీఆర్ఎస్ నేతలే కబ్జా చేశారని, అందుకే ఇప్పుడు ప్రభుత్వ చర్యలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చెరువుల పరిరక్షణ చర్యలు చేపడితే కేసీఆర్‌కు ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించిన మహేశ్ గౌడ్, హైడ్రా నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. కవిత ప్రభావం వల్లే కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొంటూ, ఆమె కారణంగానే ఆయన బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రజా సమస్యలపై కాకుండా రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి