బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

వాణిజ్య గ్యాస్ ధరల షాక్.. వ్యాపారులపై భారీ భారం

వాణిజ్య గ్యాస్ ధరల షాక్.. వ్యాపారులపై భారీ భారం

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు వెయ్యి రూపాయల వరకు పెంపు నమోదైంది.ఈ పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు వంటి చిన్న వ్యాపారాలపై అధిక భారం పడనుంది. ఇప్పటికే వరుసగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఇది మరింత కష్టంగా మారింది.ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే ధరలు పెంచడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్ని నెలల్లోనే సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఆహార పదార్థాల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.మరోవైపు, గ్యాస్ ధరల పెరుగుదల చిన్న వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు