బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గత పది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం ఈ భేటీకి వెళ్లనున్నారు.గత నెలలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పవన్ అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఇదే సమయంలో, నందగిరి హిల్స్‌లో ఇటీవల మరణించిన రీజెన్సీ సెరామిక్స్ అధినేత జి.ఎన్. నాయుడు కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ రోజు ఆయన కార్యక్రమాల్లో ఈ రెండు సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్