బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ఆర్టీసీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ బలోపేతం, ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో విలీనంపై అన్ని యూనియన్లు కలిసి చర్చించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని కోరారు. పీఆర్సీ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఆర్టీసీ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, ఆ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించారు.ఆర్టీసీ అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టెర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా 1000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. మినీ బస్సులను కూడా ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. డీజిల్ ఖర్చును తగ్గించేందుకు ఈవీ బస్సులను ప్రోత్సహిస్తున్నామని, ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఉన్న అప్పులను తీర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.కార్మికులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, రాజకీయ ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఆర్టీసీని దేశంలోనే అత్యుత్తమ సంస్థగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి