బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల వసతుల మెరుగుదలకు గడువు విధించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ కార్మికుల వసతుల మెరుగుదలకు గడువు విధించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌/హుస్నాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్‌డిపోలు, బస్‌స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన మెరుగుపర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ లోపు పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.కార్మికుల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రతి నెల రెండో మంగళవారం గ్రీవెన్స్‌ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డిపోలు, బస్‌స్టేషన్లలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు సహా క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి లేకుండా, సహకార దృక్పథంతో పని చేయించాలని తెలిపారు. నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి పరిస్థితులను మెరుగుపర్చాలని సూచించారు.టికెట్‌ జారీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరికలతో ప్రదర్శించడం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి