బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పవన్ కల్యాణ్‌కు పీవీ సింధు ప్రశంసలు

మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పవన్ కల్యాణ్‌కు పీవీ సింధు ప్రశంసలు

అమరావతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరిశుభ్రత కోసం చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలను ఆమె అభినందించారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో సింధు మాట్లాడుతూ, గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ వ్యవస్థ ద్వారా మురుగు నీరు రోడ్లపైకి రాకుండా నియంత్రించబడుతుందని, భూగర్భ జలాల స్థాయి మెరుగుపడే అవకాశముందని ఆమె వివరించారు. కాలువల్లోనే నీరు ఇంకిపోవడం వల్ల దుర్వాసన సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు.ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పవన్ కల్యాణ్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ, రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సింధు ఆకాంక్షించారు.ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా స్పందిస్తూ, మ్యాజిక్ డ్రెయినేజ్ వ్యవస్థపై అభిప్రాయం వ్యక్తం చేసిన పీవీ సింధుకు ధన్యవాదాలు తెలిపింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్