బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో మహానాడు ఘనంగా.. భారీ ఏర్పాట్లు: మంత్రి ఆనం

నెల్లూరులో మహానాడు ఘనంగా.. భారీ ఏర్పాట్లు: మంత్రి ఆనం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమం కోసం అనువైన స్థలాలను పరిశీలించి, నివేదికలను పార్టీ అధిష్టానానికి పంపించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన మహానాడు సంప్రదాయం 44 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారని చెప్పారు.మహానాడుకు భారీగా డెలిగేట్లు హాజరుకానున్నారని, మొదటి రెండు రోజుల్లో కనీసం 25 వేల మంది పాల్గొంటారని, మూడో రోజు జరిగే బహిరంగ సభకు సుమారు 8 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు.ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధిపై మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థకు శంకుస్థాపన జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.రాష్ట్రంలో రహదారులు, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, ప్రస్తుతం రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్