బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు విమర్శలు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు విమర్శలు

సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.జిల్లాలోని మల్లారం వద్ద సిద్దిపేట-కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన ఆయన, గత 28 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, అక్కడ ధాన్యం సేకరణ జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడదెబ్బ కారణంగా ధాన్యం కుప్పల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన హరీశ్ రావు, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి