బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం.. నలుగురిపై చర్యలు కోరిన భానుప్రకాశ్ రెడ్డి

టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం.. నలుగురిపై చర్యలు కోరిన భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై బీజేపీ నేత, పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాల నెయ్యి సరఫరా వ్యవహారంలో నలుగురు అధికారులే బాధ్యులని తెలిపారు.దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదికలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర కీలకమని కమిషన్ తేల్చిందని తెలిపారు. నిబంధనల సడలింపుల కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన భానుప్రకాశ్ రెడ్డి, మే 6న జరిగే పాలక మండలి సమావేశంలో ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా, లడ్డూ నాణ్యతపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ పాలక మండలి సభ్యుడు ఓవీ రమణ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా లడ్డూ నాణ్యత మెరుగుపడలేదని, అవసరమైన పదార్థాలు సరైన మోతాదులో లేవని అన్నారు.శ్రీవారి లడ్డూ భక్తుల విశ్వాసానికి సంబంధించినదని, ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నాణ్యతను కాపాడాలని ఆయన సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్